సంజయ్ పటేల్‌కు షాక్ | shock to Sanjay Patel | Sakshi
Sakshi News home page

సంజయ్ పటేల్‌కు షాక్

Apr 29 2014 1:41 AM | Updated on Sep 2 2017 6:39 AM

సంజయ్ పటేల్‌కు షాక్

సంజయ్ పటేల్‌కు షాక్

బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్‌కు తమ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

 బరోడా: బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్‌కు తమ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బరోడా క్రికెట్ అసోసియేషన్ (బీసీఏ) మేనేజింగ్ కమిటీలో సభ్యుడిగా కొనసాగుతున్న పటేల్‌ను ఆ పదవి నుంచి తొలగించారు. ఆదివారం జరిగిన బీసీఏ మేనేజింగ్ కమిటీ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. పటేల్‌తో పాటు మరో ముగ్గురిపై కూడా వేటు పడింది.

 ఇటీవల జరిగిన బీసీఏ ఎన్నికల్లో చిరాయు అమిన్ గ్రూపు మెజారిటీ స్థానాలు దక్కించుకుంది. అయితే సంజయ్ పటేల్  సంయుక్త కార్యదర్శిగా తన స్థానాన్ని నిలుపుకున్నారు.

కానీ ఎన్నికల అనంతరం పటేల్‌తో పాటు మరో నలుగురు కమిటీ నిబంధనలను ఉల్లంఘించారనే కారణంతో ఉద్వాసన పలకాలని డిమాండ్లు వినిపించాయి. ఓ సమావేశంలో కమిటీ సభ్యులు ఇదే అంశాన్ని లేవనెత్తగా బీసీఏ అధ్యక్షుడు సమర్జిత్ గైక్వాడ్ తన వీటో పవర్‌ను ఉపయోగించి అడ్డుకున్నారు. అయితే ఈ విషయంలో అధ్యక్షుడికి ఎక్కువ అధికారాలున్నాయా.. కమిటీకా.. తేలేందుకు లీగల్ అభిప్రాయాన్ని తీసుకోవాలని నిర్ణయించారు. మేనేజింగ్ కమిటీకి అనుకూలంగా లీగల్ అభిప్రాయం రావడంతో సంజయ్ పటేల్‌ని తొలగించారు.

Advertisement
 
Advertisement
Advertisement