
టెన్నిస్ స్టార్ సానియా మిర్జా భర్త షోయబ్ మాలిక్ అద్దం పగలగొట్టాడు.
బ్రాంప్టన్: టెన్నిస్ స్టార్ సానియా మిర్జా భర్త షోయబ్ మాలిక్ అద్దం పగలగొట్టాడు. ఒకసారి కాదు రెండు సార్లు. వాళ్లేదో గొడవ పడ్డారని అపార్థం చేసుకోకండి. అతడు కొట్టిన బంతులు తగిలి గ్రౌండ్‌లో అద్దాలు పగిలిపోయాయి. బౌండరీ వెలుపలికి అతడు కొట్టిన రెండు బంతులు నేరుగా రెండు కిటికీల అద్దాలకు తగలడంతో అవి ధ్వంసమయ్యాయి. గ్లోబల్ టి20 కెనడా లీగ్‌లో అతడీ విన్యాసం చేశాడు.
వాంకోవర్ నైట్స్ కెప్టెన్‌గా ఉన్న మాలిక్ గురువారం బ్రాంప్టన్ వోల్‌వ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగి ఆడాడు. 26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 46 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా రసెల్(43), టీపీ వైసీ(40) విజృంభించడంతో వాంకోవర్ నైట్స్ 16 ఓవర్లలో 170 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 16 ఓవర్లకు కుదిరించారు. లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బ్రాంప్టన్ టీమ్ 13.4 ఓవర్లలో 103 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మున్రో ఒక్కడే అర్ధ సెంచరీ(62)తో ఒంటరి పోరాటం చేశాడు. మిగతా ఆటగాళ్లెవరూ రెండంకెల స్కోరు చేయలేకపోవడంతో 77 పరుగులతో బ్రాంప్టన్ వోల్‌వ్స్ ఓటమిపాలైంది. ఈ విజయంతో వాంకోవర్ నైట్స్ నాకౌట్‌లో అడుగుపెట్టింది.
In an unusual scenario, @realshoaibmalik literally hit two glass breaking sixes.#GT2019 #BWvsVK pic.twitter.com/5kuAQoQBbE
— GT20 Canada (@GT20Canada) August 9, 2019