ఆసియా బాక్సింగ్ క్వార్టర్స్ లోకి శివ, దేవేంద్రో | shiva, devendro enter quarters of asian boxing | Sakshi
Sakshi News home page

ఆసియా బాక్సింగ్ క్వార్టర్స్ లోకి శివ, దేవేంద్రో

Aug 30 2015 8:12 PM | Updated on Sep 3 2017 8:25 AM

ఆసియన్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్లో భారత బాక్సర్లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. 56 కిలోల విభాగంలో శివ థాపా, 49 కేజీల విభాగంలో దేవేంద్రో సింగ్ లు క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించారు.

ఆసియన్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్లో భారత బాక్సర్లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. 56 కిలోల విభాగంలో శివ థాపా, 49 కేజీల విభాగంలో దేవేంద్రో సింగ్ లు క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించారు. జోర్డాన్ కు చెందిన మహ్మద్ అల్వదీతో జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో శివ 3-0 తేడాతో విజయం సాధించాడు. మరో మ్యాచ్ లో దేవేంద్రో 3-0 తేడాతో  చైనాకు చెందిన హీ- జున్ జున్ ను ఓడించాడు.

కాగా..గత ఏడాది ఇదే టోర్నీలో రజత పతకం సాధించిన మన్దీప్ జంగ్రా ఈ సారి ప్రీ క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగాడు. 69 కిలోల విభాగంలో బరిలోకి దిగిన మన్దీప్ 1-2 స్కోర్ తో జపాన్ బాక్సర్ యసుహిరో సుజుకీ చేతిలో పరాజయం చెందాడు. సెప్టెంబర్ ఒకటిన జరగనున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో దేవేంద్రో క్వాంగూ లాంగూతో,  శివ కజకిస్తాన్ కు చెందిన ఒమర్ బెక్తో తలపడనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement