భారత్‌పై విండీస్‌ బ్యాట్స్‌మన్‌ రికార్డు | Shimron Hetmyer Record Ton In Guwahati Odi Against India | Sakshi
Sakshi News home page

Oct 21 2018 4:50 PM | Updated on Oct 21 2018 5:29 PM

Shimron Hetmyer Record Ton In Guwahati Odi Against India - Sakshi

హెట్‌మెయిర్‌

భారత్‌పై అత్యంత వేగంగా సెంచరీ సాధించిన ..

గువాహటి : భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో వెస్టిండీస్‌ బ్యాట్స్‌మన్‌ హెట్‌మెయిర్‌ సెంచరీతో చెలరేగాడు. 74 బంతుల్లో 6 ఫోర్లు 6 సిక్స్‌లతో కెరీర్‌లో మూడో సెంచరీ సాధించాడు. ఈ శతకంతో భారత్‌పై అత్యంత వేగంగా సెంచరీ సాధించిన నాలుగో విండీస్‌ బ్యాట్స్‌మన్‌గా హెట్‌మెయిర్‌ గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో వివ్‌ రిచర్డ్స్‌ 72 బంతుల్లో శతకం సాధించి తొలి స్థానంలో ఉండగా.. రికార్డో పావెల్‌ సైతం 72 బంతుల్లోనే ఈ ఫీట్‌ను సాధించి ఆ తరువాతి స్థానంలో ఉన్నాడు.

సామ్యూల్స్‌ 73 బంతుల్లో చేయగా.. తాజాగా హెట్‌మెయిర్‌ 74 బంతుల్లో శతకం సాధించాడు. అంతేకాకుండా వెస్టిండీస్‌ తరపున వన్డేల్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో మూడు సెంచరీలు సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. హెట్‌మెయిర్‌ మూడు సెంచరీలకు 13 ఇన్నింగ్స్‌లు ఆడగా.. వివ్‌ రిచర్డ్స్‌ 16, గ్రీనిడ్జే 27, సిమన్స్‌ 41 ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇక హెట్‌మెయిర్‌కు భారత్‌తో ఇదే తొలి వన్డే మ్యాచ్‌ కావడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement