నా ఒక్కగానొక్క భార్యతో వాలెంటైన్స్‌ డే..!

Shikhar Dhawan Celebrates Valentine Day With Wife Aesha Dhawan - Sakshi

న్యూఢిల్లీ : గాయం కారణంగా జట్టుకు దూరమైన టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ కుటుంబానికి సమయం కేటాయిస్తున్నాడు. వాలెంటైన్స్‌ డే సందర్భంగా ధావన్‌ షేర్‌ చేసిన ఓ ఫొటో అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. భార్య ఆయేషాతో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌ చేసిన ధావన్‌.. ‘నా ఒక్కగానొక్క సతీమణి, స్నేహితురాలితో ప్రేమికుల దినోత్సవ వేడుకలు’అని క్యాప్షన్‌ పెట్టాడు. అందమైన జంటకు ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు అని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. ధావన్‌కు అతని ఐపీఎల్‌ టీమ్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ కూడా శుభాకాంక్షలు తెలిపింది.
(చదవండి : ధావన్‌ స్థానంలో పృథ్వీ షా)

ఇక పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ధానవ్‌ సహచరుడు హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ కూడా అభిమానులకు వాలెంటైన్స్‌ డే శుభాకాంక్షలు తెలిపాడు. ‘రేపంటూ లేనట్టుగా మీ ఇష్టమైన వారికి ప్రేమను పంచండి’అని క్యాప్షన్‌ పెట్టి భార్య రితికాతో ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌ చేశాడు. ఆస్ట్రేలియా సిరీస్‌లో భుజానికి గాయమైన ధానవ్‌ న్యూజిలాండ్‌ పర్యటనకు దూరమైన సంగతి తెలిసిందే. టీ20, వన్డే సిరీస్‌లకు దూరమైన ధావన్‌, టెస్టు సిరీస్‌కు కూడా ఎంపిక కాలేదు. న్యూజిలాండ్‌-భారత్‌ తొలిటెస్టు ఫిబ్రవరి 21న మొదలు కానుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top