టెస్టు క్రికెట్ కు వాట్సన్ గుడ్ బై | shane watson retires from test cricket | Sakshi
Sakshi News home page

టెస్టు క్రికెట్ కు వాట్సన్ గుడ్ బై

Sep 6 2015 3:39 PM | Updated on Sep 3 2017 8:52 AM

టెస్టు క్రికెట్ కు వాట్సన్ గుడ్ బై

టెస్టు క్రికెట్ కు వాట్సన్ గుడ్ బై

ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ టెస్టు క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్నాడు.

లండన్: ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ టెస్టు క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్నాడు. తాను టెస్టుల నుంచి వైదొలుగుతున్నట్లు షేన్ వాట్సన్ ఆదివారం ప్రకటించాడు. ఇంగ్లండ్ తో జరిగిన రెండో వన్డేలో గాయపడిన షేన్ వాట్సన్.. ఇక టెస్టుల నుంచి రిటైరయ్యే సమయం ఆసన్నమైందని పేర్కొన్నాడు.

 

ఇటు వన్డేల్లో, టెస్టుల్లో, ట్వంటీ 20 ల్లో ఆస్ట్రేలియాకు  అద్భుత విజయాలందించిన వాట్సన్.. 59 టెస్టు మ్యాచ్ లు ఆడాడు.  2005లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ తో వాట్సన్ టెస్టుల్లో ఆరంగేట్రం చేశాడు. అతని టెస్టు కెరీయర్ లో 35 .0 పైగా సగటుతో నాలుగు సెంచరీలు చేశాడు.  టెస్టుల్లో షేన్ వాట్సన్ అత్యధిక స్కోరు 176. కాగా, 75 వికెట్లు తీశాడు.

 

ప్రస్తుతం ఇంగ్లండ్ తో జరుగుతున్న వన్డేల్లో ఆసీస్ దుమ్మురేపుతోంది.  దీంతో ఐదు మ్యాచ్ ల సిరీస్ లో ఆసీస్ 2-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతకుముందు జరిగిన యాషెస్ సిరీస్ ను ఆసీస్ 2-3 తేడాతో కోల్పోయిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement