వాట్సన్కు వార్నర్ కంగ్రాట్స్ | Shane Warne congratulates Shane Watson for Royals captaincy | Sakshi
Sakshi News home page

వాట్సన్కు వార్నర్ కంగ్రాట్స్

Mar 11 2014 5:02 PM | Updated on Sep 2 2017 4:35 AM

వాట్సన్కు వార్నర్ కంగ్రాట్స్

వాట్సన్కు వార్నర్ కంగ్రాట్స్

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్గా నియతుడైన ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ షేన్ వాట్సన్కు స్పిన్ దిగ్గజం షేన్ వార్నర్ అభినందనలు తెలిపాడు.

న్యూఢిల్లీ: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్గా నియతుడైన ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ షేన్ వాట్సన్కు స్పిన్ దిగ్గజం షేన్ వార్నర్ అభినందనలు తెలిపాడు. త్వరలో ప్రారంభంకానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఏడో ఎడిషన్లో వాట్సన్ రాణించాలని ఆకాంక్షించాడు. ఈ మేరకు ట్విటర్లో కామెంట్ పోస్ట్ చేశాడు. దీంతో పాటు వాట్సన్తో తాను కలిసివున్న ఫోటో పెట్టాడు. ఈ ఫోటోలో వీరిద్దరూ రాజస్థాన్ రాయల్స్ జెర్సీలు ధరించి ఉన్నారు.

రాజస్థాన్ రాయల్స్ జట్టుకు వార్నర్ తొలి కెప్టెన్గా వ్యవహరించాడు. 2008లో తొలి ఐపీఎల్ టైటిల్ను రాజస్థాన్ టీమ్కు సాధించిపెట్టాడు. వార్నర్ తర్వాత ద్రవిడ్ కెప్టన్గా వ్యవహరించాడు. గత సీజన్ అనంతరం రాహుల్ ద్రవిడ్ టి20 క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడంతో వాట్సన్ను కెప్టెన్గా నియమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement