‘అతడు మెచ్చిన ఆ నలుగురిలో.. కోహ్లి’

Shahid Afridi Likes Four Best Batsmen Present World Cricket - Sakshi

హైదరాబాద్‌: ప్రస్తుత క్రికెట్‌లో తనకు నచ్చిన నలుగురు బ్యాట్స్‌మన్ల పేర్లను పాకిస్తాన్‌ మాజీ సారథి, ఆల్‌రౌండర్‌ షాహిద్‌ ఆఫ్రిది తెలిపాడు. శనివారం ట్విటర్‌ వేదికగా ఫ్యాన్స్‌ అడిగిన ప్రశ్నలకు ఆఫ్రిది ఓపికగా సమాధానాలు ఇచ్చాడు. దీనిలో భాగంగా ఓ నెటిజన్‌ ప్రస్తుత క్రికెట్‌లో నచ్చిన బ్యాట్స్‌మెన్‌ ఎవరని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు సమాధానంగా టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి, ఇంగ్లండ్‌ టెస్టు సారథి జోయ్‌ రూట్‌, ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌, పాకిస్తాన్‌ ప్రధాన బ్యాట్స్‌మన్‌ బాబర్‌ అజమ్‌ పేర్లను ఆఫ్రిది తెలిపాడు. అయితే బాబర్, కోహ్లిలలో ఒకరినే ఎంపిక చేసుకోవాలంటే ఎవరిపై మొగ్గు చూపుతారని మరో అభిమాని అడగ్గా.. ఇద్దరిలో ఒక్కరిని ఎంపిక చేసుకోవడం చాలా కష్టమని.. ఇద్దరూ తనకు నచ్చిన ఆటగాళ్లని పేర్కొన్నాడు. 

ప్రస్తుతం విరాట్‌ కోహ్లి అసాధారణ రీతిలో ఆడుతున్నాడని.. ప్రతీ మూడు మ్యాచ్‌లకు ఒక హాఫ్‌ సెంచరీ సాధస్తున్నాడని ప్రశంసించాడు. బాబర్‌ అజమ్‌ కూడా టీ20ల్లో 50కి పైగా సగటుతో రాణిస్తున్నాడని తెలిపాడు. రూట్‌, స్మిత్‌లు టెస్టుల్లో గొప్పగా ఆడుతున్నారని అభిప్రాయపడ్డాడు. ఇక దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో 72 పరుగులతో అజేయంగా నిలిచిన కోహ్లిపై ఆఫ్రిది ప్రశంసల జల్లు కురిపించిన విషయం తెలిసిందే. ‘ కోహ్లి నువ్వొక అసాధారణ ఆటగాడివి. నీ సక్సెస్‌ ఇలానే కొనసాగాలి. ప్రపంచంలోని క్రికెట్‌ అభిమానుల్ని నీ ఆట తీరుతో మరింత అలరించు’ అంటూ ఆఫ్రిది ట్వీట్‌ చేశాడు. ఆఫ్రిది ట్వీట్‌పై నెటిజన్లు, కోహ్లి ఫ్యాన్స్‌ అమితానందం వ్యక్తం చేస్తున్నారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top