వీనస్ ను కంగుతినిపించిన సెరెనా | serena williams beats venus williams, enters into quarter final | Sakshi
Sakshi News home page

వీనస్ ను కంగుతినిపించిన సెరెనా

Jul 6 2015 7:12 PM | Updated on Sep 3 2017 5:01 AM

వీనస్ ను కంగుతినిపించిన సెరెనా

వీనస్ ను కంగుతినిపించిన సెరెనా

వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో భాగంగా సోమవారం జరిగిన ప్రి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో వీనస్ విలియమ్స్ పై సెరెనా విలియమ్స్ విజయం సాధించి క్వార్టర్స్ లోకి ప్రవేశించింది.

లండన్: వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో భాగంగా సోమవారం జరిగిన ప్రి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో అక్క వీనస్ విలియమ్స్ ను చెల్లెలు సెరెనా విలియమ్స్ కంగుతినిపించింది. ఆద్యంతం ఏకపక్షంగా సాగిన మ్యాచ్ లో సెరెనా 6-4, 6-3 తేడాతో  వీనస్ పై గెలుపొంది క్వార్టర్స్ లోకి ప్రవేశించింది. తొలి సెట్ లో వీనస్ కాస్త ప్రతిఘటించింది. అయితే సెరెనా పదునైన ఏస్ ల ముందు వీనస్ తలవంచి గేమ్ ను కోల్పోయింది. రెండో గేమ్ లో సెరెనా మరింత దూకుడుగా ఆడి వీసన్ ను మట్టికరిపించింది.

 

2009 వింబుల్డన్ టోర్నీ తర్వాత వీరిద్దరూ తొలిసారి తలపడిన గ్రాండ్ స్లామ్ లో పోరులో వీనస్ పై సెరెనా ఆధిపత్యం చెలాయించింది. దీంతో అక్కా చెల్లెళ్ల ముఖాముఖి రికార్డును సెరెనా 15-11 తేడాతో మెరుగుపర్చుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement