బొటాస్‌కు రెండో టైటిల్‌ | Second title for Botas | Sakshi
Sakshi News home page

బొటాస్‌కు రెండో టైటిల్‌

Jul 10 2017 2:26 AM | Updated on Sep 5 2017 3:38 PM

బొటాస్‌కు రెండో టైటిల్‌

బొటాస్‌కు రెండో టైటిల్‌

మెర్సిడెస్‌ జట్టు డ్రైవర్‌ వాల్తెరి బొటాస్‌ ఈ ఏడాది రెండో టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఫార్ములావన్‌ సీజన్‌లో భాగంగా ఆదివారం జరి గిన ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి రేసు

ఆస్ట్రియా గ్రాండ్‌ప్రిలో విజేత
స్పీల్‌బెర్గ్‌ (ఆస్ట్రియా): మెర్సిడెస్‌ జట్టు డ్రైవర్‌ వాల్తెరి బొటాస్‌ ఈ ఏడాది రెండో టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఫార్ములావన్‌ సీజన్‌లో భాగంగా ఆదివారం జరి గిన ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి రేసులో బొటాస్‌ 71 ల్యాప్‌లను గంటా 21 నిమిషాల 48.527 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ‘పోల్‌ పొజిషన్‌’తో రేసును ఆరంభించిన బొటాస్‌ ఆరంభంలోనే ఆధిక్యంలోకి వెళ్లి వెనుదిరిగి చూడలేదు. ఈ సీజన్‌లోనే రష్యా గ్రాండ్‌ప్రిలోనూ బొటాస్‌ విజేతగా నిలిచాడు. ఫెరారీ డ్రైవర్‌ వెటెల్‌కు రెండో స్థానం, రికియార్డో (రెడ్‌బుల్‌) మూడో స్థానం, హామిల్టన్‌ (మెర్సిడెస్‌) నాలుగో స్థానం పొందారు. భారత్‌కు చెందిన ఫోర్స్‌ ఇండియా డ్రైవర్లు పెరెజ్‌ ఏడో స్థానంలో, ఒకాన్‌ ఎనిమిదో స్థానంలో నిలిచారు. సీజన్‌లోని తదుపరి రేసు బ్రిటిష్‌ గ్రాండ్‌ప్రి ఈనెల 16న జరుగుతుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement