సింగపూర్ గ్రాండ్ ప్రి విజేత వెటెల్ | sebastian vettel wins singapore grand prix title | Sakshi
Sakshi News home page

సింగపూర్ గ్రాండ్ ప్రి విజేత వెటెల్

Sep 20 2015 7:59 PM | Updated on May 29 2019 3:19 PM

సింగపూర్ గ్రాండ్ ప్రి విజేత వెటెల్ - Sakshi

సింగపూర్ గ్రాండ్ ప్రి విజేత వెటెల్

ఈ ఏడాదిలో తొలిసారి ఫార్ములావన్ గ్రాండ్ ప్రి టైటిల్ ను ప్రపంచ మాజీ చాంపియన్, ఫెరారీ జట్టు డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ సాధించాడు.

సింగపూర్: ఈ ఏడాదిలో తొలిసారి ఫార్ములావన్ గ్రాండ్ ప్రి టైటిల్ ను ప్రపంచ మాజీ చాంపియన్, ఫెరారీ జట్టు డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ సాధించాడు. మెర్సిడెస్ జట్టు డ్రైవర్ల జోరుకు కళ్లెం వేసిన వెటెల్ ఎట్టకేలకు టైటిల్ ను సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ప్రధాన రేసును పోల్ పొజిషన్ నుంచి మొదలు పెట్టిన వెటెల్ ఆద్యంతం ఆకట్టుకున్నాడు.

 

కాగా, రేసును రెండో స్థానం నుంచి మొదలు పెట్టిన మాజీ సహచరుడు, రెడ్ బుల్ డ్రైవర్ రికియార్డో నుంచి వెటెల్ కు తీవ్ర పోటీ ఎదురైంది. అయితే ల్యాప్ ను అందరికంటే వేగంగా పూర్తి చేసిన వెటెల్ విజేతగా నిలిచాడు. ఇదిలా ఉండగా భారత్ కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్ పెరెజ్  ఏడో స్థానంలో నిలిచాడు.

Advertisement
 
Advertisement
Advertisement