సాత్విక్‌ జంటకు టైటిల్‌ | Satwik-Chirag win Vietnam challenger | Sakshi
Sakshi News home page

సాత్విక్‌ జంటకు టైటిల్‌

Mar 28 2017 1:18 AM | Updated on Sep 5 2017 7:14 AM

సాత్విక్‌ జంటకు టైటిల్‌

సాత్విక్‌ జంటకు టైటిల్‌

హైదరాబాద్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ రంకీరెడ్డి సాత్విక్‌ సాయిరాజ్‌ వియత్నాం ఓపెన్‌ అంతర్జాతీయ చాలెంజర్‌ డబుల్స్‌ టైటిల్‌ను

న్యూఢిల్లీ: హైదరాబాద్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ రంకీరెడ్డి సాత్విక్‌ సాయిరాజ్‌ వియత్నాం ఓపెన్‌ అంతర్జాతీయ చాలెంజర్‌ డబుల్స్‌ టైటిల్‌ను సాధించాడు. భారత్‌కే చెందిన చిరాగ్‌ శెట్టితో జతకట్టి ఆడిన సాత్విక్‌ విజేతగా నిలిచాడు.

వియత్నాంలోని హనోయ్‌లో ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్‌ ఫైనల్లో సాత్విక్‌–చిరాగ్‌ శెట్టి ద్వయం 17–21, 21–9, 21–15తో ఐదో సీడ్‌ త్రావుత్‌ పొతియెంగ్‌–నంతాకమ్‌ యోర్డ్‌ఫైసాంగ్‌ (థాయ్‌లాండ్‌) జోడీపై విజయం సాధించింది. సెమీఫైనల్లో సాత్విక్‌–చిరాగ్‌ జోడీ 16–21, 21–11, 21–18తో హెంద్రా గుణవాన్‌ –మార్కిస్‌ కిడో (ఇండోనేసియా) జంటపై సంచలన విజయం సాధించింది.  

Advertisement
 
Advertisement
Advertisement