
పట్టుమని పది ఓవర్లు కూడా ఆడని..
న్యూఢిల్లీ: ఎప్పుడూ ఏదో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నెటిజన్ల చేత చివాట్లు తినే టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ మరోసారి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ అనంతరం మంజ్రేకర్ ట్వీట్ చేస్తూ.. 50 ఓవర్ల మ్యాచ్ చూస్తున్న ప్రతిసారీ పది ఓవర్లు ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తోందని పేర్కొన్నాడు. ఇదే అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. ఇంకేముంది సోషల్‌మీడియా వేదికగా ఓ ఆటఆడుకున్నారు.
‘వన్డే మ్యాచ్‌ను టెస్ట్‌లా ఆడే నువ్వు కూడా ఇలా మాట్లాడుతావా?’అని ఒకరు ఘాటుగా కామెంట్ చేయగా..‘మీరు కామెంట్రీ బాక్స్‌లో ఉన్నప్పుడు నా స్నేహితుడితో నేను కూడా ఇలాగే అంటుంటా’ అని మరొకరు...‘మీరు చెప్పింది నిజమే.. ఎందుకంటే మీరెప్పుడూ పట్టుమని పది ఓవర్లు కూడా ఆడలేదు కదా’ అని ఇంకొకరు కామెంట్ చేశారు. 40 ఓవర్లు అయ్యాక నువ్వు నిరభ్యంతరంగా వెళ్లిపోవచ్చని, నిజంగా 40 ఓవర్ల మ్యాచ్ ఉన్నా నువ్వు ఇలాంటి డైలాగే చెబుతావని, నీ ట్వీట్లు ఎప్పుడూ ఇలానే ఉంటాయా? అని మండిపడ్డారు. మైదానంలో స్టంప్స్ మైక్స్ గురించి కూడా సంజయ్ ఇలానే మాట్లాడి చివాట్లు తిన్నాడు.
This is what I say to my friend when you are commentating
— Akki (@CrickPotato1) March 2, 2019
Even 10 overs feel like 50 overs when you are commentating.
— R D (@parashuram___) March 2, 2019
Look who is talking.. the person played odi like test cricket...
— Rakesh yadav (@rakesh4special) March 2, 2019