సానియాకు తొలి డబ్ల్యూటీఏ ఫైనల్స్‌ టైటిల్ | Sania Mirza wins first WTA year-end finals title | Sakshi
Sakshi News home page

సానియాకు తొలి డబ్ల్యూటీఏ ఫైనల్స్‌ టైటిల్

Oct 26 2014 3:04 PM | Updated on Sep 2 2017 3:25 PM

సానియాకు తొలి డబ్ల్యూటీఏ ఫైనల్స్‌ టైటిల్

సానియాకు తొలి డబ్ల్యూటీఏ ఫైనల్స్‌ టైటిల్

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తొలి డబ్ల్యూటీఏ ఫైనల్స్‌ టైటిల్ సాధించింది.

సింగపూర్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తొలి డబ్ల్యూటీఏ ఫైనల్స్‌ టైటిల్ సాధించింది. మహిళల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో మహిళల డబుల్స్ టైటిల్ ను కారా బ్లాక్(జింబాబ్వే)తో కలిసి ఆమె సాధించింది.

ఆదివారం జరిగిన తుదిపోరులో డిఫెండింగ్ చాంపియన్స్ సు వీ సెయి (చైనీస్ తైపీ)-షుయె పెంగ్ (చైనా)లపై 6-1, 6-0తో ఓడించి సానియా, కారా విజేతలుగా నిలిచారు. మరోవైపు వేర్వేరు భాగస్వాములతో కలిసి గతంలో ఈ టోర్నీని రెండుసార్లు నెగ్గిన కారా బ్లాక్ కు ఇది మూడో టైటిల్ కావడం విశేషం.
 

శనివారం జరిగిన సెమీఫైనల్లో సానియా-కారా బ్లాక్ ద్వయం 4-6, 7-5, 11-9తో క్వెటా పెషెక్ (చెక్ రిపబ్లిక్)-కాటరీనా స్రెబోత్నిక్ (స్లొవేనియా) జోడీపై అద్భుత విజయం సాధించింది.

Advertisement
 
Advertisement
Advertisement