14 వరుస విజయాల తర్వాత ఓటమి | Sania Mirza, Martina's winning run broken in Stuttgart | Sakshi
Sakshi News home page

14 వరుస విజయాల తర్వాత ఓటమి

Apr 23 2015 6:41 PM | Updated on Sep 3 2017 12:45 AM

14 వరుస విజయాల తర్వాత ఓటమి

14 వరుస విజయాల తర్వాత ఓటమి

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు షాక్ తగిలింది. మహిళల డబుల్స్ విభాగంలో నంబర్ వన్ ర్యాంకు దక్కించున్న తర్వాత ఆడిన తొలి మ్యాచ్ లో సానియా పరాజయం పాలైంది.

స్టట్ గార్ట్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు షాక్ తగిలింది. మహిళల డబుల్స్ విభాగంలో నంబర్ వన్ ర్యాంకు దక్కించున్న తర్వాత ఆడిన తొలి మ్యాచ్ లో సానియా పరాజయం పాలైంది. సానియా- మార్టినా హింగ్ జోడి జైత్రయాత్రకు బ్రేక్ పడింది. పోర్షె టెన్నిస్ గ్రాండ్ ప్రిక్స్ టోర్నమెంట్ తొలి రౌండ్ లోనే ఈ జంట ఓడింది. పెట్రా మార్టిక్(క్రొయేషియా), స్టెపానీ ఓగ్ట్(లీచెటెన్ స్టీన్) చేతిలో 3-6 3-6 తేడాతో సానియా-హింగిస్ జోడి పరాజయం పాలైంది.

14 విజయాల తర్వాత సానియా-హింగిస్ జంటకు ఎదురైన తొలి ఓటమి ఇది. వరుసగా ఇండియన్ వెల్స్, మియామి, చార్లెస్టన్ టోర్నమెంట్లలో డబుల్స్  టైటిల్స్ గెలిచిన ఈ విక్టరీ పెయిర్.. పోర్షె టెన్నిస్ గ్రాండ్ ప్రిక్స్ లో తొలి రౌండ్ లోనే ఇంటిదారి పట్టి నిరాశపరిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement