సానియా జోడీకి టైటిల్ | Sania Mirza, Cara Black triumphs in Tokyo Open | Sakshi
Sakshi News home page

సానియా జోడీకి టైటిల్

Sep 21 2014 1:33 AM | Updated on Sep 2 2017 1:41 PM

సానియా జోడీకి టైటిల్

సానియా జోడీకి టైటిల్

ప్రస్తుత సీజన్‌లో అద్వితీయ ఆటతీరును ప్రదర్శిస్తున్న సానియా మీర్జా పాన్ పసిఫిక్ ఓపెన్‌లోనూ మెరిసింది.

పాన్ పసిఫిక్ ఓపెన్
టోక్యో: ప్రస్తుత సీజన్‌లో అద్వితీయ ఆటతీరును ప్రదర్శిస్తున్న సానియా మీర్జా పాన్ పసిఫిక్ ఓపెన్‌లోనూ మెరిసింది. జింబాబ్వేకు చెందిన కారా బ్లాక్‌తో కలిసి ఆమె డబుల్స్ టైటిల్‌ను నిలబెట్టుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో స్పెయిన్ జోడి గార్డిన్ ముగురుజా, కార్లా స్వారెజ్ నవారోపై 6-2, 7-5 తేడాతో సానియా ద్వయం నెగ్గింది. గంటా 15 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా, బ్లాక్ ఏడు సార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేశారు.

విజేతగా నిలిచిన సానియా జోడికి 44 వేల 835 డాలర్లు (రూ. 27 లక్షల 26 వేలు) ప్రైజ్‌మనీగా లభించింది. కెరీర్‌లో సానియాకిది 21వ డబుల్స్ టైటిల్‌కాగా... కారా బ్లాక్‌తో కలిసి నాలుగోది. తాజా విజయంతో సానియా ఆసియా క్రీడల్లో బరిలోకి దిగేందుకు ఇంచియాన్ బయలుదేరి వెళ్లనుంది. దివిజ్ శరణ్ లేదా సాకేత్‌లలో ఒకరితో కలిసి మిక్స్‌డ్ డబుల్స్‌లో ఆడనుంది.

Advertisement
 
Advertisement
Advertisement