హింగిస్పై సానియాదే పైచేయి! | sania Mirza and Dodig enter semis | Sakshi
Sakshi News home page

హింగిస్పై సానియాదే పైచేయి!

Jan 28 2016 3:10 PM | Updated on Sep 3 2017 4:29 PM

హింగిస్పై సానియాదే పైచేయి!

హింగిస్పై సానియాదే పైచేయి!

ఆస్ట్రేలియా ఓపెన్ లో టాప్ సీడ్ సానియా మీర్జా(భారత్)-ఇవాన్ డోడిగ్(క్రొయేషియా) జోడి సెమీ ఫైనల్ కు చేరింది.

మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ లో టాప్ సీడ్  సానియా మీర్జా(భారత్)-ఇవాన్ డోడిగ్(క్రొయేషియా) జోడి సెమీ ఫైనల్ కు చేరింది. గురువారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో  సానియా జంట 7-6(1),  6-3 తేడాతో డిఫెండింగ్ చాంపియన్స్ లియాండర్ పేస్(భారత్)-మార్టినా హింగిస్(స్విట్జర్లాండ్) పై గెలిచి సెమీస్ లోకి ప్రవేశించారు.

 

ఒక గంటా 13 నిమిషాల పాటు జరిగిన పోరులో సానియా-డోడిగ్ ద్వయం పదునైన ఏస్ లతో ఆకట్టుకుంది. తొలి సెట్ టై బ్రేక్ కు దారి తీసినా సానియా-డోడిగ్ లు ఏమాత్రం ఏకాగ్రత కోల్పోకుండా హింగిస్-పేస్ పై పైచేయి సాధించి ఆ గేమ్ ను కైవసం చేసుకున్నారు. ఆ తరువాత కూడా అదే ఊపును కొనసాగించడంతో సానియా-డోడిగ్ జోడి సెమీస్ కు చేరింది. తమ తదుపరి పోరులో ఎలెనా వెస్నినా(రష్యా)- బ్రోనో సోర్స్(బ్రెజిల్) జంటతో సానియా-డోడిగ్ జోడి తలపడనుంది.

 

2009 లో మహేష్ భూపతి కలిసి ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్ డ్ డబుల్స్  టైటిల్ ను సానియా చివరిసారి సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మహిళల డబుల్స్ విభాగంలో హింగిస్ తో కలిసి ఫైనల్ కు చేరిన సానియా మరో టైటిల్ కు ఒక అడుగు దూరంలో నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement