ప్రిక్వార్టర్స్‌లో సానియా జంట | Sania Mirza advances at Miami Open | Sakshi
Sakshi News home page

ప్రిక్వార్టర్స్‌లో సానియా జంట

Mar 27 2017 1:14 AM | Updated on Sep 5 2017 7:09 AM

ప్రిక్వార్టర్స్‌లో సానియా జంట

ప్రిక్వార్టర్స్‌లో సానియా జంట

మయామి ఓపెన్‌ డబ్ల్యూటీఏ ప్రీమియర్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో సానియా మీర్జా

ఫ్లోరిడా (అమెరికా): మయామి ఓపెన్‌ డబ్ల్యూటీఏ ప్రీమియర్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో సానియా మీర్జా (భారత్‌)–బార్బరా స్ట్రికోవా (చెక్‌ రిపబ్లిక్‌) జంట శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో సానియా–స్ట్రికోవా ద్వయం 6–3, 7–6 (7/3)తో డెమీ షుర్స్‌ (నెదర్లాండ్స్‌)–రెనాటా వొరకోవా (చెక్‌ రిపబ్లిక్‌) జోడీపై గెలిచింది.

81 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా ద్వయం తమ సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి జంట సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్‌ చేసింది. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో తిమియా బాబోస్‌ (హంగేరి)–అనస్తాసియా పావ్లీచెంకోవా (రష్యా) జోడీతో సానియా జంట ఆడుతుంది. 

Advertisement
 
Advertisement
Advertisement