‘భార్య కెప్టెన్‌ అయితే గొడవే ఉండదు’

Sakshi Dhoni Was On Flight With Husband Wife Pilots 

టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్‌ సతీమణి సాక్షి ధోని సోషల్‌ మీడియాలో చాల యాక్టీవ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. ధోని, జీవాలకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకునే ఆమె తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌చేసిన వీడియో తెగ వైరల్‌ అవుతుంది. సరదాగా ఉన్న వీడియో, కింద రాసిన కామెంట్‌ ఆకట్టుకోవడంతో నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు. నిమిషాల్లోనే వేల లైక్స్‌, వందల కామెంట్లు వచ్చాయి. 

అసలు విషయమేమిటంటే?
సిమ్లా అందాలను వీక్షించిన అనంతరం భర్త ఎంఎస్‌ ధోనితో కలిసి సాక్షి విమానంలో తిరుగుపయనయ్యారు. ఆ విమానాన్ని నడిపే ఇద్దరు పైలెట్లు భార్యభర్తలు కావడంతో సాక్షి ఆశ్చర్యపోయారు. దీంతో వారు విమానాన్ని ఆపరేటింగ్‌ చేసే విధానాన్ని వీడియో తీసి ‘భార్యాభర్తలిద్దరూ ప్రయాణం మధ్యలో గొడవ పెట్టుకోకూడదని కోరుకుంటున్నా.. ఈ రోజు కెప్టెన్‌ భార్య అయితే గొడవ ఉండకపోవచ్చు’ అంటూ ఫన్నీగా కామెంట్‌ చేశారు. సాక్షి కామెంట్‌పై స్పందించిన ధోని‘భయపడకు నీ పక్కనే కూల్‌ హెలికాప్టర్‌ ఉంది’ అంటూ పేర్కొన్నాడు. ఇక సాక్షి వీడియో అండ్‌ కామెంట్‌పై నెటిజన్లు మిశ్రమంగా స్పందిచారు. దీనిపై కొందరు నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తే, మరికొందరు ముందు మహిళా ఫైలెట్‌ను గౌరవించండి అంటూ ఘాటుగా పేర్కొన్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top