సాకేత్ శుభారంభం | saketh good start | Sakshi
Sakshi News home page

సాకేత్ శుభారంభం

Jan 14 2016 12:40 AM | Updated on Sep 3 2017 3:37 PM

సాకేత్ శుభారంభం

సాకేత్ శుభారంభం

ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ క్వాలిఫయింగ్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని శుభారంభం చేశాడు.

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ క్వాలిఫయింగ్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ 168వ ర్యాంకర్ సాకేత్ 6-4, 6-1తో ప్రపంచ 206వ ర్యాంకర్, భారత్‌కే చెందిన రామ్‌కుమార్ రామనాథన్‌ను అలవోకగా ఓడించాడు. 66 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో భారత డేవిస్ కప్ జట్టు సభ్యుడైన సాకేత్ ఎనిమిది ఏస్‌లు సంధించడంతోపాటు రామ్‌కుమార్ సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు.
 
  శుక్రవారం జరిగే రెండో రౌండ్‌లో ప్రపంచ 261వ ర్యాంకర్ లొరెంజో గిస్టినో (ఇటలీ)తో సాకేత్ తలపడతాడు. మరోవైపు భారత అగ్రశ్రేణి ఆటగాడు సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్‌కు తొలి రౌండ్‌లోనే చుక్కెదురైంది. జర్గెన్ జాప్ (ఎస్తోనియా)తో జరిగిన మ్యాచ్‌లో సోమ్‌దేవ్ 6-2, 1-6, 4-6తో ఓడిపోయాడు. తొలి రోజు ఎండ తీవ్రత (41.6 డిగ్రీల సెల్సియస్) ఎక్కువగా ఉండటంతో మధ్యాహ్నం జరగాల్సిన క్వాలిఫయింగ్ మ్యాచ్‌లకు విరామం ఇచ్చి సాయంత్రం వేళలో నిర్వహించారు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement