సైనాకు కేంద్రం రూ. 9 లక్షల సాయం

సైనాకు కేంద్రం రూ. 9 లక్షల సాయం


న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్కు కేంద్రం ప్రభుత్వం 9 లక్షల రూపాయలు సాయం చేసింది. 2016 రియో ఒలింపిక్స్ సన్నాహకాల్లో భాగంగా సైనా పూర్తి స్థాయి ఫిజియోథెరపిస్ట్ను నియమించుకునేందుకుగాను కేంద్ర క్రీడల శాఖ ఈ మొత్తాన్ని మంజూరు చేసింది. ఈ నెల నుంచి 15 నెలల కాలానికి ఫిజియోథెరపిస్ట్కు నెలకు 60 వేల రూపాయల చొప్పున ఈ మొత్తాన్ని కేటాయించారు. ఫిజియోథెరపిస్ట్గా ఎవరు ఉండాలన్న విషయాన్ని సైనాయే నిర్ణయించుకోవచ్చని కేంద్ర క్రీడల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. సైనా ప్రస్తుతం బెంగళూరులోని ప్రకాశ్ పదుకొన్ బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ పొందుతోంది. లండన్ ఒలింపిక్స్లో సైనా కాంస్యం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top