సింగపూర్ ఓపెన్లో సైనా అవుట్ | Saina Nehwal ousted from Singapore Open | Sakshi
Sakshi News home page

సింగపూర్ ఓపెన్లో సైనా అవుట్

Apr 9 2014 8:35 PM | Updated on Sep 2 2017 5:48 AM

సింగపూర్ ఓపెన్లో సైనా అవుట్

సింగపూర్ ఓపెన్లో సైనా అవుట్

భారత ఏస్ షట్లర్ సైన నెహ్వాల్ మరోసారి స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరచలేకపోయింది. సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్లో సైనా తొలిరౌండ్లోనే చతికిలపడింది.

సింగపూర్: భారత ఏస్ షట్లర్ సైన నెహ్వాల్ మరోసారి స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరచలేకపోయింది. సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్లో సైనా తొలిరౌండ్లోనే చతికిలపడింది. మహిళల సింగిల్స్లో ఏడో సీడ్గా బరిలోకి దిగిన హైదరాబాదీ 21-16, 15-21, 11-21 స్కోరుతో జపాన్ షట్లర్ ఎరికో హిరోసి చేతిలో ఓడిపోయింది.

బుధవారమిక్కడ దాదాపు గంటసేపు హోరాహోరీగా సాగిన పోరులో సైనా తొలి గేమ్ నెగ్గినా ఆనక అదే జోరు కొనసాగించలేకపోయింది. రెండు గేమ్లతో పాటు మ్యాచ్ను కోల్పోయింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement