సైనా మరో'సారీ'.. | Saina Nehwal crashes out of Hong Kong Open | Sakshi
Sakshi News home page

సైనా మరో'సారీ'..

Nov 21 2013 3:26 PM | Updated on Sep 2 2018 3:19 PM

సైనా మరో'సారీ'.. - Sakshi

సైనా మరో'సారీ'..

భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఈ ఏడాదిలో స్థాయికి తగ్గట్టు రాణించలేకపోతున్న హైదరాబాదీకి మరోసారి నిరాశ ఎదురైంది.

భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఈ ఏడాదిలో స్థాయికి తగ్గట్టు రాణించలేకపోతున్న హైదరాబాదీకి  మరోసారి నిరాశ ఎదురైంది. హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్లో సైనా రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో ఏడో సీడ్ సైనా 17-21, 21-9, 15-21 స్కోరుతో పోర్న్టిప్ బురానప్రసెట్సుక్ (థాయ్లాండ్) చేతిలో ఓడిపోయింది.

పురుషుల సింగిల్స్లోనూ భారత ఆటగాడు అజయ్ జయరామ్ 18-21, 12-21తో సోనీ డ్వి కున్కోరొ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయాడు. ఈ ఏడాదిలో సైనా ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయింది. సీజన్ చివర్లోనైనా నెగ్గాలన్న సైనా ఆశలు నెరవేరలేదు. గాయాలు, పేలవ ఫామ్ కారణంగా ఆశించిన స్థాయిలో ఆడలేకపోతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement