
కౌలాంలపూర్: మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత షట్లర్ సైనా నెహ్వాల్ కథ ముగిసింది. మహిళల సింగిల్స్‌లో భాగంగా గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో సైనా నెహ్వాల్ 15-21, 13-21 తేడాతో యమగూచి(జపాన్) చేతిలో పరాజయం పాలైంది. 36 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో యమగూచి చెలరేగి ఆడింది. ఈ రెండు గేమ్‌ల్లోనూ సైనాకు ఏమాత్రం అవకాశం ఇవ్వని యమగూచి ఆకట్టుకుని క్వార్టర్స్‌లోకి చేరగా, సైనా రెండో రౌండ్ నుంచే నిష్క్రమించాల్సి వచ్చింది. వీరిద్దరూ ముఖాముఖి పోరులో ఇప్పటివరకూ ఆరుసార్లు తలపడగా యమగూచి ఐదుసార్లు విజయం సాధించింది. కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌లోనే సైనా గెలుపొందింది.