నా ఉద్దేశం అది కాదు:సైనా నెహ్వాల్ | Saina Nehwal Clarifies She Never 'Demanded' Padma Award | Sakshi
Sakshi News home page

నా ఉద్దేశం అది కాదు:సైనా నెహ్వాల్

Jan 6 2015 9:17 AM | Updated on Sep 2 2017 7:19 PM

నా ఉద్దేశం అది కాదు:సైనా నెహ్వాల్

నా ఉద్దేశం అది కాదు:సైనా నెహ్వాల్

పద్మభూషణ్ అవార్డుకు తన దరఖాస్తును తిరస్కరించడంపై ధ్వజమెత్తిన బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఆ అవార్డు కోసం డిమాండ్ చేయడానికి తాను ఎవర్ననని ఆమె ప్రశ్నించింది.

న్యూఢిల్లీ: పద్మభూషణ్ అవార్డుకు తన దరఖాస్తును తిరస్కరించడంపై ధ్వజమెత్తిన బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఆ అవార్డు కోసం డిమాండ్ చేసే స్థాయి తనకు లేదని స్పష్టం చేసింది.  ‘పద్మభూషణ్’ విషయంలో తన ఆవేదనను మీడియా తప్పుగా అర్థం చేసుకుందని సైనా నెహ్వాల్ ఆరోపించింది.  తానేనాడూ ఈ ప్రతిష్టాత్మక అవార్డు కోసం డిమాండ్ చేయలేదని తెలిపింది.

 

‘పద్మభూషణ్ అవార్డును నాకెందుకు ఇవ్వరు? అనే ఉద్దేశంతో అడిగినట్టు మీడియా ఫోకస్ చేసింది. కానీ నా ఉద్దేశం అది కాదు. నా పేరును ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదో తెలుసుకోవాలనుకున్నాను'అని సైనా తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement