ఎలాగైనా బౌలింగ్‌ చేస్తా.. వికెట్‌ తీస్తా!

Safari Bowler Picks Up Wickets Bowling With Both Arms - Sakshi

కేప్‌టౌన్‌: క్రికెట్‌లో రెండు చేతులతో బౌలింగ్‌ చేయడం చాలా అరుదు.  గతంలో శ్రీలంక స్పిన్నర్‌ కామిందు మెండిస్‌ రెండు చేతులతో బౌలింగ్‌ చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇప్పుడు అదే తరహా బౌలింగ్‌తో మరొక బౌలర్‌ వచ్చేశాడు. తనకు కుడి-ఎడమ తేడా లేదంటున్నాడు దక్షిణాఫ్రికా గ్రెగొరీ మహలోక్వానా. రెండు చేతులతో బౌలింగ్‌ చేయడం అనేది చాలా కష్టం. ఎంతో శ్రమిస్తేకానీ ఇలా బౌలింగ్‌ చేయలేదు.

సౌతాఫ్రికాలో జరుగుతున్న ఎమ్‌జాన్సీ టీ20 సూపర్‌ లీగ్‌లో గ్రెగొరీ రెండు చేతులతో బౌలింగ్‌ చేయడమే కాకుండా వికెట్లు కూడా సాధించాడు. కేప్‌టౌన్‌ బ్లిట్జ్‌ తరఫున ఆడుతున్న గ్రెగొరీ..  ఆదివారం డర్బన్‌ హీట్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు వికెట్లు సాధించాడు. తొలుత కుడి చేతి బౌలింగ్‌ చేసి ఓపెనర్‌ సారే ఎర్వీని ఔట్‌ చేసిన గ్రెగొరీ..ఆపై ఎడమ చేతితో బౌలింగ్‌ చేసి డానే విలాస్‌ను బోల్తా కొట్టించాడు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో కేప్‌టౌన్‌ బ్లిట్జ్‌ 10 పరుగుల తేడాతో గెలిచింది. ముందు బ్యాటింగ్‌ చేసిన కేప్‌టౌన్‌ ఆరు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేయగా, డర్బన్‌ హీట్‌ ఏడు వికెట్లు కోల్పోయి 164 పరుగులే చేసింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top