యాహూ.. సచినే విజేత.. గెలిపించిన ఫ్యాన్స్‌ | Sakshi
Sakshi News home page

వారి భుజాలపై సచిన్‌.. బెస్ట్‌ మూమెంట్‌ అదే

Published Tue, Feb 18 2020 10:39 AM

Sachin Wins Laureus Sporting Moment Award 2020 for 2011 World Cup Winning Moment - Sakshi

‘ఇన్నేళ్లుగా దేశమంతా ఉంచిన భారాన్ని సచిన్ మోశారు. ఇప్పుడు మేం ఆయన్ను మోశాం’ ఐసీసీ వన్డే ప్రపంచకప్‌-2011 ఫైనల్లో శ్రీలంకపై టీమిండియా అపూర్వ విజయం తర్వాత దిగ్గజ ఆటగాడు సచిన్‌ టెండూల్కర్‌ను తోటి ఆటగాళ్లు తమ భుజాలపై ఎత్తుకొని  స్టేడియం అంతా ఊరేగిన సందర్భంలో ప్రస్తుత సారథి విరాట్‌ కోహ్లి ఆరోజు పలికిన మాటలు ఇవి. ఆ అపూర్వ ఘట్టాన్ని చూసిన యావత్‌ ప్రపంచం ఆనందభాష్పాలకు లోనయింది. అంతేకాకుండా ప్రతీ ఒక్క క్రికెట్‌ అభిమాని సెల్యూట్‌ చేశాడు. తాజాగా లారస్‌ స్పోర్టింగ్‌ మూమెంట్‌ 2000-2020 అవార్డు కూడా ఆ అరుదైన ఘట్టానికి సలాం చేసింది. 

బెర్లిన్‌: టీమిండియా దిగ్గజ ఆటగాడు, ‘క్రికెట్‌ గాడ్‌’ సచిన్‌ టెండూల్కర్‌కు అరుదైన గౌరవం లభించింది. ప్రతిష్టాత్మక లారస్ స్పోర్టింగ్ మూమెంట్‌ 2000-2020 అవార్డు మాస్టర్‌ బ్లాస్టర్‌ను వరించింది. బెర్లిన్‌లో జరిగిన ఈ అవార్డుల ప్రధానోత్సవంలో సచిన్‌ ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకున్నాడు. గత 20 ఏళ్లలో ప్రపంచ క్రీడల్లో అత్యంత అపురూప ఘట్టాలన్నింటిలో​ బెస్ట్‌ మూమెంట్‌కు ఈ అవార్డును అందించడం కోసం పోటీ  నిర్వహించారు. దీనిలో భాగంగా ఈ అవార్డు ఎవరికివ్వాలో నిర్ణయించేందుకు ఆన్‌లైన్‌ పోల్‌ నిర్వహించారు. 

ఈ పోటీలో 19 మంది పోటీ పడగా అత్యధిక ఓట్లు రావడంతో సచిన్‌ విజేతగా నిలిచాడు. 2011 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో టీమిండియా విజయం తర్వాత సచిన్‌ను సహచర ఆటగాళ్లు తమ భుజాలపై ఎత్తుకుని స్టేడియం అంతా ఊరేగించారు. క్యారీడ్ ఆన్ ద షోల్డ‌ర్స్ ఆఫ్ నేష‌న్ (దేశాన్ని భుజాల‌పై ఊరేగించారు) అనే క్యాప్ష‌న్‌తో ఓటింగ్ నిర్వ‌హించారు. ఈ మూమెంట్‌కే ప్ర‌స్తుతం అవార్డు ద‌క్కింది. కాగా,  2017లో స్పోర్టింగ్ మూమెంట్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని లారస్ ప్రారంభించింది. గత 20 ఏళ్లలో జరిగిన ఘట్టాలన్నింటిలో బెస్ట్‌ మూమెంట్‌ను ఎంపిక చేసి, ఈ ఏడాది పురస్కారాన్ని ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ ప్రతిష్టాత్మక అవార్డు సచిన్‌కు రావడం పట్ల యావత్‌ క్రికెట్‌ ప్రపంచం ఆనందం వ్యక్తం చేస్తోంది. 

చదవండి:
ఈ సారథ్యం నాకొద్దు! 
ఆడకుండా.. నన్ను కిడ్నాప్‌ చేశారు

Advertisement
 
Advertisement
 
Advertisement