
సెహ్వాగ్.. నీ గ్యాస్‌తో అందరిని ఇబ్బంది పెడ్తున్నావు
లండన్ : ఎప్పుడూ సరదాగా ఇతర ఆటగాళ్లను ఆటపట్టించే టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను ఓ సారి సరదాగా ఏడిపించానని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తెలిపాడు. ప్రపంచకప్-2019 నేపథ్యంలో ఇండియా టూడే నిర్వహించిన సలామ్ క్రికెట్ 2019 కార్యక్రమంలో సచిన్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
అది 2003 ప్రపంచకప్. పాకిస్తాన్‌తో మ్యాచ్. ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ 274 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. సెంచూరియన్ వేదికగా మార్చి1న జరిగిన ఈ మ్యాచ్ సందర్భంగా సచిన్ సరదాగా సెహ్వాగ్‌ను ఆటపట్టించాడు. ఒపెనర్‌గా తాను ఎప్పుడూ స్ట్రైక్ తీసుకోనని, కానీ ఆరోజు సెహ్వాగ్ వచ్చి తనని తొలి బంతి ఆడమన్నాడని, దానికి తాను అంగీకరించలేదన్నాడు. అప్పటికే తాను సెహ్వాగ్‌ను ఏడిపించాలని డిసైడ్ అయినట్లు తెలిపాడు. ‘సెహ్వాగ్.. నీ గ్యాస్‌తో అందరిని ఇబ్బంది పెడ్తున్నావు’ అని గట్టిగా నవ్వుతూ అన్నట్లు.. సచిన్ నాటి రోజులను గుర్తుచేసుకున్నాడు. ఇక ఆ మ్యాచ్‌లో సెహ్వాగ్ 21, సచిన్ 98 పరుగులు చేశారు. సచిన్ సూపర్ ఇన్నింగ్స్ భారత్ 26 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.