సచిన్ తనయ సారా పరుగు | sachin tendulkar daughter sara run for Mumbai Marathon 2014 | Sakshi
Sakshi News home page

సచిన్ తనయ సారా పరుగు

Jan 20 2014 2:31 PM | Updated on Sep 2 2017 2:49 AM

‘ముంబై మారథాన్’ ఉత్సాహంగా సాగింది. ఈ మారథాన్‌లో పారిశ్రామికవేత్తలు, బాలీవుడ్ నటులు, పర్యావరణ వేత్తలు పరుగులు తీశారు.

ముంబై: ‘ముంబై మారథాన్’ ఉత్సాహంగా సాగింది. ఆదివారం ఉదయం పూటే గజగజలాడే చలిలో ప్రారంభమైన ఈ మారథాన్‌లో పారిశ్రామికవేత్తలు, బాలీవుడ్ నటులు, పర్యావరణ వేత్తలు, వేలాది మంది ముంబైకర్లు పరుగులు తీశారు. మహిళలు, వయోధికులు, వికలాంగులు, విద్యార్థులు, విదేశీ అథ్లెట్లు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు.

భారత పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ, బాలీవుడ్ నటులు దియా మీర్జా, తారా శర్మ, అఫ్తబ్ సదాశివ్‌దాసని, గుల్షన్ గ్రోవర్, నేహా ధూపియా, జూహీ చావ్లా, ప్రాచీ దేశాయ్, మహి గిల్, సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జాన్ అబ్రహాం జెండా ఊపి మారథాన్‌ ప్రారంభించారు.

సీఎస్టీ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 5.30 గంటలకు ప్రారంభమైన ఈ మారథాన్ మెరైన్ డ్రైవ్, హజీఅలీ, వర్లీ సీ ఫేస్, వర్లీ-బాంద్రా సీలింక్ వంతెన మీదుగా బాంద్రాకు చేరుకొని అక్కడి నుంచి తిరిగి సీఏస్టీకి చేరుకుంది. పలు సామాజిక అంశాలు, రుగ్మతలపై ప్రజలను చైతన్య వంతులను చేసేందుకు ఈ మారథాన్ నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement