దగ్గరి దారులు వెతక్కండి!

Sachin Launches Tendulkar Middlesex Global Academy - Sakshi

కుర్రాళ్లకు సచిన్‌ సూచన

ముంబై: కెరీర్‌లో పైకి ఎదిగే క్రమంలో దగ్గరి దారులు వెతకవద్దని, సవాళ్లు ఎదురైనప్పుడు మోసం చేసైనా ముందుకు వెళ్లే ప్రయత్నం చేయవద్దని క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ యువ ఆటగాళ్లకు సూచించాడు. అలా చేస్తే ఏదో ఒక దశలో దొరికిపోతారని, ప్రపంచం ముందు పరువు పోతుందని అతను హెచ్చరించాడు. సచిన్‌ తన సొంత క్రికెట్‌ అకాడమీ ‘టెండూల్కర్‌ మిడిలెసెక్స్‌ గ్లోబల్‌ అకాడమీ డీవై పాటిల్‌ స్పోర్ట్స్‌ సెంటర్‌’ను మంగళవారం ఇక్కడ ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో అతనితో పాటు ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్ మైక్‌ గ్యాటింగ్, ముంబై క్రికెట్‌ సంఘం అధ్యక్షుడు విజయ్‌ పాటిల్‌ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా సచిన్‌ మాట్లాడుతూ కుర్రాళ్లలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశాడు.

‘క్రమశిక్షణ, ఏకాగ్రత, ప్రణాళిక తదితర అంశాల గురించి జీవితంలో నేను ఎన్నో నేర్చుకున్నాను. అయితే చాలా సార్లు అంచనాలకు తగిన విధంగా రాణించకుండా విఫలమయ్యాను కూడా. అయితే నేను మళ్లీ సరైన దిశలో వెళ్లేందుకు నాకు ఆట ఉపయోగపడింది. ఈ క్రమంలో ఎలాంటి దగ్గరి దారులు లేవని కూడా అర్థమైంది. మున్ముందు సవాళ్లు ఎదురైనా మోసపూరితంగా మాత్రం వ్యవహరించరాదని తెలుసుకున్నాను. నేను చివరి టెస్టులో అవుటైన తర్వాత కూడా దాని గురించి మా అన్నయ్యతో చర్చించాను. మళ్లీ బ్యాటింగ్‌ చేయనని తెలిసి కూడా ఆ షాట్‌ను ఎలా ఆడాల్సిందని విశ్లేíÙంచుకున్నాను. ఇదంతా నేర్చుకోవడమే’ అని సచిన్‌ వ్యాఖ్యానించాడు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top