తిరుమలలో రోహిత్‌ శర్మ | Rohit sharma At Tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో రోహిత్‌ శర్మ

May 8 2019 8:44 PM | Updated on May 9 2019 2:17 PM

Rohit sharma At Tirumala - Sakshi

రోహిత్‌ శర్మ (ఫైల్‌ ఫోటో)

టీమిండియా వైస్‌ కెప్టెన్‌, ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ బుధవారం తిరుమలకు చేరుకున్నాడు.

సాక్షి, తిరుమల: టీమిండియా వైస్‌ కెప్టెన్‌, ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ బుధవారం తిరుమలకు చేరుకున్నాడు. ఈ రాత్రికి ఇక్కడే బస చేసి గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నాడు. రోహిత్‌ శర్మ తరచుగా తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తుంటాడు. 2017లో ఐపీఎల్‌ టైటిల్‌ గెలిచిన తర్వాత సతీసమేతంగా వెంకన్నను దర్శించుకున్నాడు. తాజాగా జరుగుతున్న ఐపీఎల్‌ 12లో ముంబై ఇండియన్స్‌ టీమ్‌ ఫైనల్‌కు చేరింది. మంగళవారం జరిగిన తొలి క్వాలిఫైయర్‌ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఓడించి టైటిల్‌ వేటకు సిద్ధమైంది. ఈ నెల 12న హైదరాబాద్‌లో రోహిత్‌ సేన ఫైనల్‌ మ్యాచ్‌ ఆడనుంది.

విశాఖ చేరుకున్న ధోని సేన
ఈనెల 10న విశాఖపట్నంలో వైఎస్ఆర్ స్టేడియంలో జరగనున్న క్వాలిఫైయర్‌-2 మ్యాచ్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు బుధవారం ఇక్కడికి చేరుకుంది. విశాఖ విమానాశ్రయంలో ఆటగాళ్లకు నిర్వాహకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement