రోహిత్‌ శర్మ ఔట్‌ | Rohit Sharma misses out with a hamstring injury | Sakshi
Sakshi News home page

రోహిత్‌ శర్మ ఔట్‌

Apr 10 2019 7:49 PM | Updated on Apr 10 2019 7:53 PM

Rohit Sharma misses out with a hamstring injury - Sakshi

ముంబై: ఇండియన్‌ పీమ్రియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) సీజన్‌లో 12లో భాగంగా స్థానిక వాంఖేడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో​ జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ తలపడుతోంది.  ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ముంబై ఇండియన్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన ముంబై ఇండియన్స్‌ తాత్కాలిక కెప్టెన్‌ పొలార్డ్‌ ముందుగా కింగ్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ముంబై రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గాయం కారణంగా మ్యాచ్‌కు దూరమయ్యాడు. దాంతో అతని స్థానంలో పొలార్డ్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. కాగా, గాయపడిన రోహిత్‌ శర్మ స్థానంలో సిద్దేశ్‌ లాడ్‌కు తుది జట్టులో అవకాశం కల్పించారు. ఇది సిద్దేశ్‌ లాడ్‌కు ఐపీఎల్‌ అరంగేట్రపు మ్యాచ్‌

ఇప్పటివరకూ కింగ్స్‌ పంజాబ్‌ ఆరు మ్యాచ్‌లు ఆడగా నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరొకవైపు ఐదు మ్యాచ్‌లు ఆడిన ముంబై మూడు విజయాల్ని సొంతం చేసుకుంది. ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. సన్‌రైజర్స్‌తో సోమవారం జరిగిన గత మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ విజయం సాధించగా, శనివారం సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో మరో ఆసక్తికర పోరు జరగవచ్చు.

కింగ్స్‌ పంజాబ్‌
రవిచంద్రన్‌ అశ్విన్‌(కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, క్రిస్‌ గేల్‌, కరుణ్‌ నాయర్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, డేవిడ్‌ మిల్లర్‌, మన్‌దీప్‌ సింగ్‌, స్యామ్‌ కరన్‌, హర్దుస్‌ విల్జోయిన్‌, మహ్మద్‌ షమీ,అంకిత్‌ రాజ్‌పుత్‌

ముంబై ఇండియన్స్‌
పొలార్డ్‌(కెప్టెన్‌), డీకాక్‌, సిద్దేశ్‌ లాడ్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌, కృనాల్‌ పాండ్యా, హార్దిక్‌ పాండ్యా, రాహుల్‌ చాహర్‌, అల్జరీ జోసెఫ్‌,  బెహ్రెన్‌డార్ప్‌, బుమ్రా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement