కోహ్లికంటే రోహిత్‌ అదృష్టవంతుడా!  | Rohit sharma luckey more than virat kohli! | Sakshi
Sakshi News home page

కోహ్లికంటే రోహిత్‌ అదృష్టవంతుడా! 

Sep 18 2018 1:02 AM | Updated on Sep 18 2018 5:40 AM

Rohit sharma luckey more than virat kohli! - Sakshi

ఆసియా కప్‌ను మాత్రమే కాకుండా ఇటీవలి ఇంగ్లండ్‌ పర్యటన తర్వాత కోల్పోయిన అభిమానుల విశ్వాసాన్ని కూడా గెలుచుకునే లక్ష్యంతో భారత్‌ బరిలోకి దిగు తోంది. మన జట్టు ఏదో అద్భుతం చేస్తుందంటూ ఇంగ్లండ్‌ పర్యటనపై ఉంచిన అంచనాలు దెబ్బ తినడంతో మెల్లగా మబ్బులు వీడిపోయాయి. ఆసియా కప్‌లో అద్భుతంగా ఆడితే ఆ గాయాలు మరచిపోయేలా చేయడంతో పాటు భారత క్రికెట్‌పై ఆసక్తి తగ్గిపోయిన వారిని కూడా మళ్లీ ఇటు వైపు చూసేలా చేయవచ్చు. హాంకాంగ్‌తో జరిగే తొలి మ్యాచ్‌ తర్వాతి రోజు పాకిస్తాన్‌తో పోరుకు ముందు మంచి వార్మప్‌గా చెప్పవచ్చు. భారత్‌ వరుసగా రెండు రోజులు మ్యాచ్‌లు ఆడాల్సి రావడం, అదీ రెండో రోజు పాకిస్తాన్‌తో తలపడే విధంగా నిర్వాహకులు అసలు షెడ్యూల్‌ను ఎలా తయారు చేశారో అర్థం కావడం లేదు. అయితే దాని గురించి ఏమీ చేయలేం. క్వాలిఫయింగ్‌ టోర్నీలో తమకంటే బలమైన జట్లను ఓడించి హాంకాంగ్‌ ఈ దశకు అర్హత సాధించింది. తొలి మ్యాచ్‌లో పాక్‌ చేతిలో చిత్తుగా ఓడిన ఆ జట్టు భారత్‌పై కాస్త మెరుగ్గా ఆడాలని భావిస్తోంది.  భారత జట్టు కుర్రాళ్లు, అనుభవజ్ఞులతో సమతూకంగా ఉంది. ముఖ్యం గా రోహిత్‌ తన ఖాతాలో మరో ఒకట్రెండు సెంచరీలు చేర్చుకో వాలని భావిస్తున్నాడు. క్లిష్ట సమయాల్లో అండగా నిలిచేందుకు పక్కనే ధోని ఉండటం కూడా రోహిత్‌ అదృష్టం.   

సాధారణంగా ఇండియా జట్టు ఆకర్షణ అంతా బ్యాటింగ్‌లోనే కనిపిస్తుంది. కానీ ఈసారి బౌలింగ్‌లో ఉన్న వైవిధ్యం కూడా ఆకట్టుకునేలా చేస్తోంది. ఇద్దరు మణికట్టు స్పిన్నర్లు చహల్, కుల్దీప్‌ వేర్వేరు శైలిలో వికెట్లు పడగొట్టడమే కాకుండా ఒకరిని మరొకరు ప్రోత్స హించుకునే తీరు చాలా బాగుంటుంది. మామూలుగా అయితే తమ బ్యాట్స్‌మెన్‌ ఎక్కువసేపు క్రీజ్‌లో గడపాలని కోరుకుంటుంది కాబట్టి అవకాశం లభిస్తే భారత్‌ తొలుత బ్యాటింగ్‌కే మొగ్గు చూపుతుంది. అయితే తర్వాతి రోజే పాకిస్తాన్‌తో ఆడాల్సి ఉంది కాబట్టి ఈ మ్యాచ్‌ను వీలైనంత తొందరగా ముగించి ప్రధాన పోరు కోసం తమ శక్తిని కాపాడుకునే ప్రయత్నం చేయవచ్చు. అది జరగాలంటే భారత్‌ టాస్‌ నెగ్గాలి. ఈ విషయంలో కోహ్లితో పోలిస్తే రోహిత్‌ అదృష్టం ఎలా ఉంటుందో చూడాలి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement