టాప్‌–5లో రోహిత్‌ శర్మ... కోహ్లి టాప్‌ ర్యాంక్‌ పదిలం

Rohit Sharma has joined the ICC rankings in a better position - Sakshi

ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతోన్న సిరీస్‌లో అదరగొడుతోన్న భారత ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ మెరుగైన స్థానానికి చేరాడు. సోమవారం ఐసీసీ విడుదల చేసిన వన్డే బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో అతను ఏకంగా నాలుగు స్థానాలు ఎగబాకి 790 పాయింట్లతో ఐదో ర్యాంకుకు చేరుకున్నాడు. అతను 2016 ఫిబ్రవరిలో అత్యుత్తమంగా మూడో ర్యాంకులో నిలిచాడు.

మరోవైపు భారత కెప్టెన్‌ కోహ్లి అగ్రస్థానంలోనే కొనసాగుతుండగా, డేవిడ్‌ వార్నర్‌ (ఆస్ట్రేలియా) 865 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. వీరిద్దరూ 12 పాయింట్ల తేడాతో తొలి రెండు స్థానాలను దక్కించుకున్నారు. రహానే నాలుగు స్థానాలు మెరుగుపరుచుకుని 24వ స్థానానికి చేరుకున్నాడు. భారత బౌలర్లలో లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌  కెరీర్‌లోనే ఉత్తమ ర్యాంకు 7కు చేరుకున్నాడు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top