రోహిత్‌కు భారీ జరిమానా | Rohit Sharma fined for slow over rate after loss against Kings Punjab | Sakshi
Sakshi News home page

రోహిత్‌కు భారీ జరిమానా

Apr 1 2019 4:53 PM | Updated on Apr 1 2019 4:59 PM

Rohit Sharma fined for slow over rate after loss against Kings Punjab - Sakshi

మొహాలీ: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు భారీ జరిమానా పడింది.  రెండు రోజుల క్రితం కింగ్స్‌ లెవెన్‌ పంజాబ్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేట్‌ కారణంగా రోహిత్‌కు రూ. 12 లక్షల జరిమానా విధించారు.  శనివారం గం.4.00 ని.లకు మొదలైన మ్యాచ్‌ గం. 7.30ని.లకు ముగియాల్సి ఉన్న ముంబై ఇండియన్స్‌ స్లో ఓవర్‌రేట్‌ నమోదు చేయడంతో మ్యాచ్‌ ఆలస్యమైంది. కింగ్స్‌ పంజాబ్‌కు నిర్దేశించిన 177 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబై నెమ్మదిగా ఓవర్లు వేసింది.

దాంతో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌కు రూ. 12లక్షల జరిమానా విధిస్తూ ఐపీఎల్‌ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఇది ఐపీఎల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌లో భాగంగా స్లో ఓవర్‌రేట్‌ తప్పిదానికి కెప్టెన్‌ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. దాంతో రోహిత్‌కు జరిమానా తప్పలేదు. ఆ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 8 వికెట్ల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. కింగ్స్‌ పంజాబ్‌ ఆటగాళ్లు కేఎల్‌ రాహుల్‌(71), మయాంక్‌ అగర్వాల్‌(43)లు రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement