నా ప్రియ నేస్తానికి ఈ సెంచరీ అంకితం : రోహిత్‌ 

Rohit Sharma Dedicates Century To His Friend Sudan - Sakshi

బ్రిస్టన్‌: టీ20 సిరీస్‌ గెలుపుతో టీమిండియా సుదీర్ఘ ఇంగ్లండ్‌ పర్యటనలో మంచి శుభారంభం చేసింది. సిరీస్‌ నిర్ణయాత్మక మ్యాచ్‌లో శతకంతో విజయంలో కీలక పాత్ర పోషించిన టీమిండియా ఓపెనర్‌ రోహిత శర్మ ఆ సెంచరీని తనకు ఇష్టమైన సూడాన్‌కు అంకితమిస్తున్నట్లు ప్రకటించాడు. ప్రపంచంలోనే  అత్యంత అరుదైన తెల్లని ఖడ్గ మృగం సూడాన్‌ గత మార్చిలో మృతి చెందిన విషయం తెలిసిందే. కెన్యాలోని ద్వార్ క్రలోవే జూలోని 45 ఏళ్ల  ఖడ్గ మృగం మరణంపై ప్రపంచవ్యాప్తంగా జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేశారు. అందులో రోహిత్‌ శర్మ కూడా ఒకడు.

సోమవారం ట్విటర్‌లో ‘ నిన్నటి నా సెంచరీని చనిపోయిన నా ప్రియ నేస్తం సూడాన్‌కు అంకితమిస్తున్నాను. మనమంతా మంచి జీవనానికి ఓ మార్గం కనుగోవాలనేమో’ అని ట్వీట్‌ చేశాడు. ఈ ట్వీట్‌కు నెటిజన్లు ఫిదా అయ్యారు. దీంతో ఇది తెగ వైరల్‌ అయింది. ఈ అరుదైన రైనో మరణంపై ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ కెవిన్‌ పీటర్సన్‌ సైతం అప్పట్లో ఆవేదన వ్యక్తం చేశాడు. ‘మనమంతా సూడాన్‌ రక్షించడంలో విఫలమయ్యాం. జంతు ప్రేమికులారా ఇప్పటికైనా మేల్కొనండి, రైనోస్‌ అన్నిటిని రక్షిద్దాం.’ అని పిలుపునిచ్చాడు. శతకంతో ​ఆకట్టుకున్న రోహిత్‌కు మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌తో పాటు, మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ లభించిన విషయం తెలిసిందే. మూడు వన్డేల సిరీస్‌ జూలై 12న ప్రారంభం కానుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top