సీకే నాయుడు ట్రోఫీ అండర్-25 క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ అదరగొట్టారు.
ఇండోర్: సీకే నాయుడు ట్రోఫీ అండర్-25 క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ అదరగొట్టారు. మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఓపెనర్ రోహిత్ రాయుడు (357 బంతుల్లో 111, 18 ఫోర్లు) సెంచరీ సాధించగా... ఆర్. సాయి (172 బంతుల్లో 76, 16 ఫోర్లు), పాలకోడేటి (208 బంతుల్లో 66, 9 ఫోర్లు) కె.పి.నాయుడు (108 బంతుల్లో 50, 6 ఫోర్లు) అర్ధసెంచరీలతో రాణించారు.
దీంతో హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో భారీస్కోరు సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 205/4తో రెండో రోజు శనివారం ఆట ప్రారంభించిన హైదరాబాద్ 173 ఓవర్లలో 471 పరుగులు చేసి ఆలౌటైంది. లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ రాణించడంతో హైదరాబాద్ 83 ఓవర్లు ఆడి క్రితం రోజు స్కోరుకు మరో 266 పరుగులు జోడించింది. మధ్యప్రదేశ్ బౌలర్లలో దాతే 3 వికెట్లు పడగొట్టగా... మిశ్రా, సహానీ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన మధ్యప్రదేశ్ జట్టు ఆటముగిసే సమయానికి 4 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 5 పరుగులు చేసింది. తివారి (3), చౌదరి (1) క్రీజులో ఉన్నారు.