థీమ్‌ చేతిలో ఫెడరర్‌కు షాక్‌ | Roger Federer clinches 1200th career win at Madrid Open | Sakshi
Sakshi News home page

థీమ్‌ చేతిలో ఫెడరర్‌కు షాక్‌

May 11 2019 12:46 AM | Updated on May 11 2019 12:46 AM

Roger Federer clinches 1200th career win at Madrid Open - Sakshi

మాడ్రిడ్‌: మూడేళ్ల తర్వాత క్లే కోర్టులపై పునరాగమనం చేసిన స్విట్జర్లాండ్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ పోరాటం మాడ్రిడ్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌ టోర్నమెంట్‌లో ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో నాలుగో సీడ్‌ ఫెడరర్‌ 6–3, 6–7 (11/13), 4–6తో ఐదో సీడ్‌ డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా) చేతిలో ఓడిపోయాడు. 2 గంటల 10 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఫెడరర్‌ రెండు మ్యాచ్‌ పాయింట్లను చేజార్చుకున్నాడు.

రెండో సెట్‌ టైబ్రేక్‌లో 8–7 వద్ద, 10–9 వద్ద ఫెడరర్‌కు గెలిచే అవకాశం వచ్చినా వాటిని వృథా చేసుకున్నాడు. కీలకదశలో సంయమనంతో ఆడిన థీమ్‌ రెండో సెట్‌ను టైబ్రేక్‌లో సొంతం చేసుకున్నాడు. అనంతరం మూడో సెట్‌లోని మూడో గేమ్‌లో, తొమ్మిదో గేమ్‌లో ఫెడరర్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన థీమ్‌ విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. ఫెడరర్‌తో ఇప్పటివరకు ఆరుసార్లు తలపడిన థీమ్‌ నాలుగుసార్లు గెలుపొందడం విశేషం.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement