శీతల్ గౌతమ్ తో రాబిన్ నిశ్చితార్థం | Robin Uthappa 'engaged' to long-time girl-friend, tweets pic | Sakshi
Sakshi News home page

శీతల్ గౌతమ్ తో రాబిన్ నిశ్చితార్థం

Nov 16 2015 3:29 PM | Updated on Sep 3 2017 12:34 PM

శీతల్ గౌతమ్ తో రాబిన్ నిశ్చితార్థం

శీతల్ గౌతమ్ తో రాబిన్ నిశ్చితార్థం

ఇటీవల ముప్ఫైవ పుట్టినరోజు జరుపుకున్న భారత మాజీ ఓపెనర్, కర్ణాటక ఆటగాడు రాబిన్ ఊతప్ప త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు.

బెంగళూరు:  ఇటీవల ముప్ఫైవ పుట్టినరోజు జరుపుకున్న భారత మాజీ ఓపెనర్, కర్ణాటక ఆటగాడు రాబిన్ ఊతప్ప త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు. గత ఏడు సంవత్సరాలుగా ప్రేమాయణం సాగిస్తున్న తన  చిన్ననాటి స్నేహితురాలు, టెన్నిస్ క్రీడాకారిణి శీతల్ గౌతమ్ తో రాబిన్ ఏడు అడుగులు నడవనున్నాడు. ఈ మేరకు వారిద్దరి నిశ్చితార్థం తాజాగా జరిగిపోయింది. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన రాబిన్ .. తాము అతి త్వరలో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు స్పష్టం చేశాడు. 

 

గత కొన్నిరోజులుగా రంజీ ట్రోఫీ మ్యాచ్ లకు దూరంగా ఉండటంతో శీతల్ వద్ద పెళ్లి ప్రస్తావన తేవడానికి సమయం దొరికినట్లు రాబిన్ తెలిపాడు. తమ సుదీర్ఘ  ప్రేమకు శీతల్ కూడా వెంటనే అంగీకారం తెలపడంతో నిశ్చితార్థం కార్యక్రమం కూడా వెంటనే జరిగిపోయినట్లు వెల్లడించాడు. ఎప్పట్నుంచో తన ప్రేమను పెళ్లిగా మార్చుకుందామని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపాడు.  ఇదిలా ఉండగా, తమ పెళ్లికి సంబంధించిన ప్రపోజల్ కోసం రాబిన్ నెలలుగా నిరీక్షిస్తున్నవిషయం తనకు తెలియదని శీతల్ తెలిపింది.


ఈ మధ్య కాలంలో టీమిండియా జట్టులో స్థానం దొరకని క్రికెటర్లు పెళ్లికి సిద్ధమవుతున్నారు.  గత నెల్లోఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్-గీతా బస్రాల పెళ్లి జరగగా, కొన్ని రోజుల క్రితం హజిల్ వుడ్ -యువరాజ్ సింగ్ ల నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. తన తండ్రి యోగరాజ్ సింగ్ అంగీకారంతో బ్రిటీష్ నటి హజిల్ తో పెళ్లికి యువీ సిద్ధమయ్యాడు.  వీరి పెళ్ళి వచ్చే ఫిబ్రవరిలో జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. కాగా, రాబిన్ -శీతల్ ల వివాహానికి సంబంధించి  ఇంకా తేదీ ఖరారు కాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement