సహాయ కోచ్‌గా... | Ricky Ponting named Australias assistant coach for World Cup | Sakshi
Sakshi News home page

సహాయ కోచ్‌గా...

Feb 9 2019 3:37 AM | Updated on Feb 9 2019 3:37 AM

Ricky Ponting named Australias assistant coach for World Cup - Sakshi

సిడ్నీ: దిగ్గజ బ్యాట్స్‌మన్, మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ను ప్రపంచ కప్‌నకు జట్టు సహాయ కోచ్‌గా నియమిస్తూ క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఐదు ప్రపంచ కప్‌లలో ప్రాతినిధ్యం, మూడుసార్లు విజేతగా నిలిచిన జట్టు సభ్యుడిగా, అందులోనూ రెండుసార్లు సారథిగా వ్యవహరించిన విశేష అనుభవం ఉన్న పాంటింగ్‌... ఆసీస్‌ బ్యాటింగ్‌ విభాగంపై ప్రత్యేక దృష్టి సారిస్తాడు. ఇప్పటికే ఆస్ట్రేలియాకు డారెన్‌ లీమన్‌ ప్రధాన కోచ్‌గా, ఇంగ్లండ్‌ మాజీ బ్యాట్స్‌మన్‌ గ్రేమ్‌ హిక్‌ బ్యాటింగ్‌ కోచ్‌గా ఉన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement