వచ్చేదంతా వాళ్ల నుంచే...

Revenue Comes From Mens Cricket And Unfair If Women Ask For Same Pay - Sakshi

సమాన చెల్లింపులంటే ఎలా?

క్రికెట్‌ ఫీజులపై స్మృతి మంధాన

ముంబై: భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి వచ్చే ఆదాయమంతా పురుషుల క్రికెట్‌ నుంచే వస్తుందని, అలాంటపుడు వారితో పాటు సమాన చెల్లింపులు మహిళలకు ఇవ్వాలంటే ఎలా వీలవుతుందని భారత స్టార్‌ మహిళా క్రికెటర్‌ స్మృతి మంధాన వ్యాఖ్యానించింది. భారత క్రికెట్లో పురుషులతో పోల్చుకుంటే తక్కువ ఫీజులు, పారితో షికాలు పొందడంపై తనకు ఎలాంటి బాధలేదని ఆమె స్పష్టం చేసింది. ఐసీసీ ‘మహిళా క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా నిలిచిన ఆమె ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇక్కడికి వచి్చంది.

పురుష క్రికెటర్లకు బీసీసీఐ వార్షిక కాంట్రాక్టులు గరిష్టంగా రూ. 7 కోట్లు ఉంటే... అదే మహిళలకైతే గరిష్టంగా రూ. 50 లక్షలు మాత్రమే ఉంది. ‘ఒక్క విషయం అందరూ అర్థం చేసుకోవాలి... బీసీసీఐకి ఎప్పుడైతే మహిళల క్రికెట్‌ నుంచి కూడా భారీగా రాబడి వస్తే... అప్పుడు సమాన ఫీజులు చెల్లించాలని డిమాండ్‌ చేయొచ్చు. అలా అడిగేవారిలో నేనే ముందుంటాను. కానీ ఇప్పుడైతే అలా అడగడం సమంజసం కాదు.  నా తోటి క్రికెటర్లకు ఈ వ్యత్యాసంపై ఆలోచన లేదు’ అని పేర్కొంది.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top