యు ముంబా ప్రతీకార విజయం | revenge win by You Mumbai | Sakshi
Sakshi News home page

యు ముంబా ప్రతీకార విజయం

Jul 21 2016 12:18 AM | Updated on Sep 4 2017 5:29 AM

కెప్టెన్ అనూప్ కుమార్ (11) రైడింగ్, ట్యాక్లింగ్‌లో చెలరేగడంతో ప్రొ కబడ్డీ లీగ్‌లో యు ముంబా కీలక విజయాన్ని అందుకుంది.

ముంబై: కెప్టెన్ అనూప్ కుమార్ (11) రైడింగ్, ట్యాక్లింగ్‌లో చెలరేగడంతో ప్రొ కబడ్డీ లీగ్‌లో యు ముంబా కీలక విజయాన్ని అందుకుంది. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 34-31తో పుణెరి పల్టన్‌పై నెగ్గింది. దీంతో టోర్నీ ఆరంభంలో పుణెరి చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది. కీలక ఆటగాడు మంజిత్ చిల్లర్ లేకుండా బరిలోకి దిగిన పల్టన్ రైడింగ్‌లో విఫలమైంది. సుర్జీత్ (5), జీవా (2), రిషాంక్ (5), రాకేశ్ (4)లు డిఫెన్స్‌లో ఆకట్టుకున్నారు. పుణేరి తరఫున అజయ్ (9), దీపక్ (7), సోమ్‌వీర్ (4)లు రాణించారు. గురువారం జరిగే మ్యాచ్‌ల్లో జైపూర్ పింక్ పాంథర్స్‌తో దబాంగ్ ఢిల్లీ; యు ముంబాతో తెలుగు టైటాన్స్ తలపడతాయి.

మహిళల కబడ్డీ చాలెంజ్ లీగ్‌లో స్టోర్మ్ క్వీన్స్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. చివరి లీగ్ మ్యాచ్‌లో స్టోర్మ్ క్వీన్స్ 21-11తో ఫైర్ బర్డ్స్‌పై గెలిచింది. ఈనెల 25న ఫైర్ బర్డ్స్, ఐస్ దివాస్‌ల మధ్య క్వాలిఫయర్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గిన జట్టు ఈనెల 31న జరిగే ఫైనల్లో స్టోర్మ్ క్వీన్స్‌తో ఆడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement