విజృంభించిన రిషబ్ | Reliance baller rishabh took five wickets | Sakshi
Sakshi News home page

విజృంభించిన రిషబ్

Nov 2 2013 12:29 AM | Updated on Sep 2 2017 12:12 AM

రిలయన్స్ బౌలర్ రిషబ్ (5/51) విజృంభించడంతో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో అక్షిత్ సీసీ జట్టుపై గెలుపొందింది.

 జింఖానా, న్యూస్‌లైన్: రిలయన్స్ బౌలర్ రిషబ్ (5/51) విజృంభించడంతో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో అక్షిత్ సీసీ జట్టుపై గెలుపొందింది. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో మొదట బరిలోకి దిగిన అక్షిత్ సీసీ 166 పరుగుల వద్ద ఆలౌటైంది. తులసి (51 నాటౌట్) అర్ధ సెంచరీతో అజేయంగా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన రిలయన్స్ రెండే వికెట్లు కోల్పోయి 167 పరుగులు చే సింది. సంపత్ (64), వైష్ణవ్ (79 నాటౌట్) అర్ధ సెంచరీలతో చెలరేగారు.
 
మరో మ్యాచ్‌లో వాకర్ టౌన్ జట్టు 186 పరుగుల భారీ తేడాతో ఫ్యూచర్ స్టార్ జట్టుపై విజయం సాధించింది. ప్రశాంత్ (73) అర్ధ సెంచరీతో రాణించగా, చంటి (44), మురళి (46) మెరుగ్గా ఆడారు. ఫ్యూచర్ స్టార్ బౌలర్లు ప్రకాష్, సురేష్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఫ్యూచర్ స్టార్ 69 పరుగులకే కుప్పకూలింది. వాకర్ టౌన్ బౌలర్లు రాజు 5, ప్రశాంత్ 3 వికెట్లు చేజిక్కించుకున్నారు.
 
 లీగ్ మ్యాచ్‌లు వాయిదా
 ఆదివారం జరగాల్సిన లీగ్ మ్యాచ్‌లను హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) వాయిదా వేసింది. దీపావళి పండగ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, తిరిగి మ్యాచ్‌లను నిర్వహించే  తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని హెచ్‌సీఏ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement