ఓపెనర్ అక్షత్ రెడ్డి (177 బంతుల్లో 17 ఫోర్లతో 105 బ్యాటింగ్) అజేయ సెంచరీ సాధించడంతో... గోవాతో జరుగుతున్న గ్రూప్ ‘సి’ రంజీ ట్రోఫీ క్రికెట్ లీగ్
నాగ్‌పూర్: ఓపెనర్ అక్షత్ రెడ్డి (177 బంతుల్లో 17 ఫోర్లతో 105 బ్యాటింగ్) అజేయ సెంచరీ సాధించడంతో... గోవాతో జరుగుతున్న గ్రూప్ ‘సి’ రంజీ ట్రోఫీ క్రికెట్ లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టుకు తొలి ఇన్నింగ్‌స ఆధిక్యం లభించింది. రెండో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ తొలి ఇన్నింగ్‌సలో 63 ఓవర్లలో నాలుగు వికెట్లకు 188 పరుగులు చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ 24 పరుగుల ఆధిక్యంలో ఉంది. అక్షత్‌కు జతగా సందీప్ (18 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు.
ఆంధ్ర మ్యాచ్‌కు వర్షం అడ్డంకి
భువనేశ్వర్: హిమాచల్ ప్రదేశ్, ఆంధ్ర జట్ల మధ్య జరుగుతున్న గ్రూప్ ‘సి’ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించింది. భారీ వర్షం కారణంగా రెండో రోజు శుక్రవారం ఒక్క బంతి ఆట కూడా సాధ్యపడలేదు.
ముంబై 176 ఆలౌట్
రోహ్‌తక్: తమిళనాడుతో జరుగుతున్న గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై తొలి ఇన్నింగ్‌సలో 176 పరుగులకు ఆలౌటై 89 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. అనంతరం తమిళనాడు తమ రెండో ఇన్నింగ్‌సలో ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లకు 153 పరుగులు చేసింది.