అజేయంగా సెమీస్‌లోకి భారత్‌ | Reaching into the mix-up, India | Sakshi
Sakshi News home page

అజేయంగా సెమీస్‌లోకి భారత్‌

Dec 19 2016 12:25 AM | Updated on Sep 4 2017 11:03 PM

లీగ్‌ దశలో వరుసగా మూడో విజయం సాధించి అజేయంగా నిలిచిన భారత్‌...

ఆసియా కప్‌ అండర్‌–19 క్రికెట్‌ టోర్నీ  

కొలంబో: లీగ్‌ దశలో వరుసగా మూడో విజయం సాధించి అజేయంగా నిలిచిన భారత్‌... ఆసియా కప్‌ అండర్‌–19 క్రికెట్‌ టోర్నమెంట్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆతిథ్య శ్రీలంక జట్టుతో ఆదివారం జరిగిన గ్రూప్‌ ‘ఎ’ మ్యాచ్‌లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న శ్రీలంక 48.5 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో హేరంబ్‌ పరబ్‌ (2/39), శివ సింగ్‌ (3/32), యశ్‌ ఠాకూర్‌ (3/38), అభిషేక్‌ శర్మ (2/32) రాణించారు.

అనంతరం భారత్‌ 39.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి విజయాన్ని దక్కించుకుంది. శుభ్‌మాన్‌ గిల్‌ (78; 10 ఫోర్లు, ఒక సిక్స్‌) టాప్‌ స్కోరర్‌గా నిలువగా... పృథ్వీ షా (36), అభిషేక్‌ శర్మ (33), ప్రియం గార్గ్‌ (32 నాటౌట్‌) కూడా ఆకట్టుకున్నారు. మంగళవారం జరిగే తొలి సెమీఫైనల్లో అప్ఘానిస్తాన్‌తో భారత్‌; బుధవారం జరిగే రెండో సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌తో శ్రీలంక తలపడతాయి.  
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement