
బుడాపెస్ట్: ప్రపంచ అండర్–23 రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో చివరిరోజు భారత్‌కే నిరాశే మిగిలింది. పురుషుల గ్రీకో రోమన్ 97 కేజీల విభాగంలో భారత రెజ్లర్ రవి రాఠి పరాజయం పాలయ్యాడు. కాంస్య పతక పోరులో రవి రాఠి 0–8తో దిమిత్రి కామిన్‌స్కీ (బెలారస్) చేతిలో ఓడిపోయాడు. ఆదివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్‌లో భారత్ తరఫున రవీందర్ (61 కేజీలు), పూజా గెహ్లోట్ (53 కేజీలు) రజత పతకాలు గెలిచారు.