అఫ్గాన్‌ ఘనారంభం | Rashid Khan Creates World Record as Afghanistan Beat Bangladesh by 46 Runs | Sakshi
Sakshi News home page

అఫ్గాన్‌ ఘనారంభం

Jun 4 2018 5:03 AM | Updated on Mar 28 2019 6:10 PM

Rashid Khan Creates World Record as Afghanistan Beat Bangladesh by 46 Runs - Sakshi

డెహ్రాడూన్‌:  భారత్‌తో చారిత్రాత్మక టెస్టుకు ముందు సన్నాహకంగా బంగ్లాదేశ్‌తో నిర్వహిస్తున్న టి20 సిరీస్‌లో అఫ్గానిస్తాన్‌ జట్టు సత్తా చాటింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రషీద్‌ ఖాన్‌ (3/13), నబీ (2/21) స్పిన్‌తో చెలరేగడంతో తొలి టి20 మ్యాచ్‌లో ఘనవిజయం సాధించింది. ఆదివారం ఇక్కడి రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో అఫ్గాన్‌ 45 పరుగుల తేడాతో బంగ్లాను చిత్తు చేసింది. ముందుగా అఫ్గానిస్తాన్‌ 8 వికెట్లకు 167 పరుగులు చేసింది. షహజాద్‌ (40; 5 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌. అనంతరం బంగ్లాదేశ్‌ 19 ఓవర్లలో 122 పరుగులకు ఆలౌటైంది. ఇరు జట్ల మధ్య రెండో మ్యాచ్‌ మంగళవారం ఇక్కడే జరుగనుంది. అఫ్గానిస్తాన్‌ జట్టును ప్రోత్సహించడంలో భాగంగా భారత్‌లో వేదికలను ఆ జట్టు హోం గ్రౌండ్‌లుగా వినియోగించుకునేందుకు బీసీసీఐ ప్రత్యేక అనుమతి ఇచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement