హరియాణాతో గురువారం ప్రారంభమైన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు భారీ స్కోరు చేయడంలో విఫలమైంది.
హరియాణాతో రంజీ మ్యాచ్
ముంబై: హరియాణాతో గురువారం ప్రారంభమైన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు భారీ స్కోరు చేయడంలో విఫలమైంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర తమ తొలి ఇన్నింగ్‌సలో 6 వికెట్లకు 217 చేసింది. డీబీ ప్రశాంత్ (182 బంతుల్లో 74; 9 ఫోర్లు), కెప్టెన్ హనుమ విహారి (120 బంతుల్లో 62; 10 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేయగా, డీబీ రవితేజ (38) ఫర్వాలేదనిపించాడు. హరియాణా బౌలర్ యజువేంద్ర చహల్ (3/57) రాణించాడు.
వర్షం ఆటంకం...
గువాహటి: హైదరాబాద్, హిమాచల్ ప్రదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వర్షం తీవ్ర అంతరాయం కలిగించడంతో తొలి రోజు 4.1 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. హిమాచల్ జట్టు 8 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోరుుంది.