' కోచ్గా రాహుల్ ద్రవిడే సరైన వ్యక్తి' | Rahul Dravid Would Make a Very Good Coach of India,says ricky Ponting | Sakshi
Sakshi News home page

' కోచ్గా రాహుల్ ద్రవిడే సరైన వ్యక్తి'

May 17 2016 7:33 PM | Updated on Sep 4 2017 12:18 AM

' కోచ్గా రాహుల్ ద్రవిడే సరైన వ్యక్తి'

' కోచ్గా రాహుల్ ద్రవిడే సరైన వ్యక్తి'

భారత క్రికెట్ కోచింగ్ పగ్గాలు చేపట్టడానికి రాహుల్ ద్రవిడ్ సరైన వ్యక్తి అని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు.

ముంబై: భారత క్రికెట్ కోచింగ్ పగ్గాలు చేపట్టడానికి రాహుల్ ద్రవిడ్ సరైన వ్యక్తి అని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. టీమిండియా కోచింగ్కు ఉన్న ఆప్షన్లలో ద్రవిడే అత్యుత్తమని రికీ పేర్కొన్నాడు. 'క్రికెట్ పరంగా ద్రవిడ్కు విపరీతమైన నాలెడ్జ్ ఉంది. దాంతోపాటు అతనికి క్రికెటర్ గా అనుభవం కూడా ఎక్కువే.ప్రస్తుతం ఐపీఎల్లో ఢిల్లీకి కోచ్గా చేస్తున్న ద్రవిడ్కు మూడు ఫార్మాట్లపై మంచి అవగాహన ఉంది. అతను కచ్చితంగా భారత్కు మంచి కోచ్ కాగలడని నా అభిప్రాయం'అని రికీ తెలిపాడు.

అయితే కోచ్ గా ఎవర్నీ నియమించాలనేది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)నిర్ణయంపై ఆధారపడి వుంటుందన్నాడు. దాంతో పాటు కెప్టెన్ నిర్ణయం కూడా కోచ్ల ఎంపిక విషయంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుందని రికీ పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement