అఫ్గాన్‌ ‘సెంచరీ’ రికార్డు

Rahmat Shah 1st Afghan Cricketer to Hit Test Hundred - Sakshi

చాట్టోగ్రామ్‌: అఫ్గానిస్తాన్‌ క్రికెటర్‌ రహ్మత్‌ షా అరుదైన జాబితాలో చేరిపోయాడు. టెస్టు ఫార్మాట్‌లో ఆ దేశం తరఫున సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. గురువారం బంగ్లాదేశ్‌తో ఆరంభమైన ఏకైక టెస్టు మ్యాచ్‌లో రహ్మత్‌ షా శతకం బాదాడు. 187 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో  102 పరుగులు చేశాడు. ఫలితంగా అఫ్గాన్‌ తరఫున తొలి టెస్టు సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డు పుస్తకాల్లోకెక్కాడు.(ఇక్కడ చదవండి: రషీద్‌ ఖాన్‌ అరుదైన ఘనత)

ఈ మ్యాచ్‌లో ఫస్ట్‌ డౌన్‌లో వచ్చిన రహ్మత్‌ షా సమయోచితంగా బ్యాటింగ్‌ చేశాడు. మూడో వికెట్‌కు 29 పరుగులు జత చేసిన రహ్మత్‌ షా.. నాల్గో వికెట్‌కు 120 పరుగుల్ని జత చేశాడు. ఈ క్రమంలోనే సెంచరీ మార్కును చేరాడు.  టీ బ్రేక్‌ తర్వాత సెంచరీ పూర్తి చేసుకున్న రహ్మత్‌ షా.. ప్రధానంగా బంగ్లాదేశ్‌ స్పిన్నర్లే లక్ష్యంగా ఆడాడు.  ఈ ఏడాది రహ్మత్‌ షాకు రెండుసార్లు టెస్టు సెంచరీ చేసే అవకాశం  వచ్చినట్లే వచ్చి చేజారింది. మార్చి నెలలో ఐర్లాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 98 పరుగుల వద్ద రహ్మత్‌ షా ఔట్‌ కావడంతో తృటిలో సెంచరీ కోల్పోయాడు. అటు తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో 76 పరుగుల వద్ద నిష్క్రమించాడు. తమ దేశాల తరఫున తొలి టెస్టు సెంచరీ సాధించిన జాబితా ఇలా ఉంది..

దేశం తరఫున తొలి టెస్టు సెంచరీ సాధించిన వారు..

చార్లెస్‌ బ్యానర్‌మేన్‌( ఆస్ట్రేలియా)
అమినుల్‌ ఇస్లామ్‌(బంగ్లాదేశ్‌)
డబ్యూ జీ గ్రేస్‌(ఇంగ్లండ్‌)
లాలా అమర్‌నాథ్‌(భారత్‌)
కెవిన్‌ ఒబ్రియన్‌(ఐర్లాండ్‌)
డెమ్‌ష్టర్‌(న్యూజిలాండ్‌)
నాజర్‌ మహ్మద్‌(పాకిస్తాన్‌)
జిమ్మీ సింక్లైర్‌(దక్షిణాఫ్రికా)
సిదాత్‌ వెట్టిమ్యూనీ(శ్రీలంక)
క్లైఫర్డ్‌ రోచ్‌(వెస్టిండీస్‌)
డేవ్‌ హాటన్‌(జింబాబ్వే)
రహ్మత్‌ షా(అఫ్గానిస్తాన్‌)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top